Share News

సర్‌ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:40 PM

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ స్పష్టం చేశారు.

సర్‌ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన  చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ స్పష్టం చేశారు. మంగళ వారం జడ్పీ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ పరిధి లోని బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎల్వోలు ఇంటిటినీ సందర్శించి ప్రతి ఒక్క అర్హత కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఓటర్ల నమో దు ప్రక్రియను మరింత వేగ వంతం చేయాల న్నారు. సమావేశంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, కార్పొరేషన్‌ కమిష నర్‌ హెచ్‌.కూర్మారావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ శివకుమార్‌, ఏసీపీ జానకి తదితరులు పాల్గొ న్నారు.

భారత డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

సర్‌ ప్రక్రియ అమలుపై భారత డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సి.పవన్‌ కుమార్‌ శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫ రెన్స్‌లో సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుతం చేపడుతున్న సర్వే, ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను కలె క్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆయనకు వివరించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 11:40 PM