Share News

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:24 PM

సంక్రాంతి పండగ సంద ర్భంగా పేకాట, కోడిపందేలు, డొక్కు ఆట, జూదం, బెట్టింగ్‌ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు.

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

శ్రీకాకుళం క్రైం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ సంద ర్భంగా పేకాట, కోడిపందేలు, డొక్కు ఆట, జూదం, బెట్టింగ్‌ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్ట వ్యతిరేక కార్య కలాపాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారి పైనే కాకుండా నిర్వాహకులు, సహకరించిన వారిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఎటు వంటి సమాచారం ఉన్నా సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు లేదా ఎస్పీ 63099 90800, స్పెషల్‌ బ్రాంచి సీఐ 63099 90886, పోలీస్‌ కంట్రోల్‌ రూం 112, పోలీస్‌ వాట్సాప్‌ నెంబర్‌ 63099 90933 నెంబర్లకు తెలపా లన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను శాంతి యుతంగా, ఆనందంగా నిర్వ హించుకోవాలని ఆయన సూచించారు.

ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రచారం

సంక్రాంతి పండుగ నేప థ్యంలో గ్రామాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండే లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సంక్రాంతి సంబరాలను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలన్న ఉద్దేశంలో ప్రజలను చైత న్యం చేసేందుకు కృషి చేస్తోంది. గ్రామాల కూడళ్లు, పట్టణాల్లో పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలను మంగళవారం చేపట్టారు. గ్రామా లు, పట్టణాల్లో పండుగను ఆసరాగా చేసుకొని జరిగే కోడి, గొర్రె పందాలు, జూదం, పిక్కాటలు, అసభ్యకరమైన నృత్య ప్రదర్శనలు చేస్తే చర్యలు తప్ప వని మైకుల్లో హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి నేరస్తులుగా మారి తమ భవిష్యత్తు జీవితాలను పాడుచేసుకోవద్దన్నారు. పండుగ వేళల్లో దొంగతనాలు, మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకొని పోయే ఘటన లు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పం డుగకు స్వగ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపర్చుకోవాలని, అవసరమైతే బ్యాంకు లాకర్లు, భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రచారం చేశారు.

Updated Date - Jan 13 , 2026 | 11:24 PM