Share News

ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:50 PM

ఎన్నికల ప్రక్రియకు ఎవరు విఘాతం కలిగించినా, గొడవలు, వివా దాలు సృష్టించినా కఠిన చర్యలు తప్ప వని ఏఎస్పీ వివేకానంద హెచ్చరిం చారు.

 ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
రాపాకలో పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్న ఏఎస్పీ వివేకానంద

ఏఎస్పీ వివేకానంద

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

పొందూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియకు ఎవరు విఘాతం కలిగించినా, గొడవలు, వివా దాలు సృష్టించినా కఠిన చర్యలు తప్ప వని ఏఎస్పీ వివేకానంద హెచ్చరిం చారు. మండలంలో సమస్యాత్మక పో లింగ్‌ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుం టోందన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అత్యంత సమస్యా త్మక, సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. బైండోవర్‌ కేసులు నమోదైన వారు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. రాపాక గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:50 PM