‘నగదు, బహుమతులు తరలిస్తే కఠిన చర్యలు’
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:48 PM
జిల్లాలో మునిసిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్ని కల నియమావళి ఉల్లంఘించి నగదు, బహు మతులు (ప్రలోభ వస్తువులు) అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మునిసిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్ని కల నియమావళి ఉల్లంఘించి నగదు, బహు మతులు (ప్రలోభ వస్తువులు) అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు ప్రశాం తంగా, పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అక్ర మ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో ఏడు అం తర్రాష్ట్ర, నాలుగు అంతర్ జిల్లా చెక్‌పోస్టు లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే ముఖ్య కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు, 24 గంటలూ నిరంతర పోలీస్ నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలీస్, రెవెన్యూ అధికా రులతో ఫ్లయింగ్ స్క్వాడ్లను ప్రత్యేక బృందాల సమన్వయంతో సంయుక్త తనిఖీలు నిర్వహి స్తున్నామన్నారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహ నాన్ని తనిఖీ చేసి ఆ వాహనాల వివరాలు నమో దు చేస్తున్నామన్నారు. ఎన్నికల నియమా వళిని ఉల్లంఘిస్తూ నగదు, మద్యం, ఇతర ప్రలోభ వస్తువులను అక్రమంగా తరలించినా, చెక్‌పోస్టు ల వద్ద పోలీసులు తనిఖీలకు సహకరించకపో యినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.