Share News

సమన్వయంతో పార్టీ బలోపేతం

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:57 PM

గ్రామస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు సూచించారు.

సమన్వయంతో పార్టీ బలోపేతం
కార్యాలయంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈశ్వరరావు

నరసన్నపేట, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు సూచించారు. గురువారం నరసన్నపేటలో పాకతోటి సింహాచలం ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. క స్థానిక ఎన్నికలలో కూటమి నాయకుల విజయానికి ప్రతి ఒక్కరు మరింత కృషి చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లడుతూ నియోజవర్గంలో బీజేపీ మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాఽధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, జిల్లా ఇన్‌చార్జి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు, జిల్లా మాజీ అధ్యక్షులు అట్టాడ రవిబాబ్జీ, టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, జనసేన నాయకులు మెట్ట వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 11:57 PM