Share News

క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేయండి

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:17 AM

రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం వచ్చిన జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలు, కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు.

 క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేయండి
మాట్లాడుతున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి

నెలిమర్ల ఎమ్మెల్యే లోకం మాఽధవి

లావేరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం వచ్చిన జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలు, కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో నెలిమర్ల, ఎచ్చెర్ల, భీమిలి నియోజక వర్గాల్లో జనసేన బలంగా ఉందని చెప్పారు. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియో జకవర్గాల్లో 1.50 లక్షల సభ్యత్వాలు చేయడం లక్ష్యంగా నిర్ణయిం చుకున్నామని, దీనిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించా లన్నారు. జనసేన నాయకుడు లోకం ప్రసాద్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ జనసేన ఉని కిని చాటి చెప్పాలని సూచించారు. పనిచేసే కార్యకర్తలక పార్టీ అండగా ఉంటుంద న్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ విష్వక్సేన్‌, రణస్థలం ఎఫ్‌ఏసీ ఎస్‌ చైర్మన్‌ బొంతు విజయ్‌ కృష్ణ, సేనసేన జిల్లా కార్యదర్శి వడ్డాది శ్రీనివాస్‌, కాకర్ల బాబాజీ పాల్గొన్నారు.

‘ఉద్యమి’కి రూ.లక్ష విరాళం

ఇచ్ఛాఫురం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమి సభ్యత్వాలకు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి, ఏపీ కళింగ కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ లోళ్ల రాజేష్‌ రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పార్ల మెంటరీ సభ్యత్వ సమన్వయకర్త, సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్‌కు రూ.లక్ష చెక్కును అంద జేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చీకటి కృష్ణయ్య, రోకళ్ల భాస్కరరావు, బైపల్లి దాలయ్య, పెద్దింటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:17 AM