గాలివాన బీభత్సం
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:05 AM
ఓవైపు ఉరుములు, మరోవైపు మెరు పులు బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి గాలి, వాన భీభత్సం సృష్టిం చింది.
టెక్కలిలో నెలకొన్న అంధకారం
టెక్కలి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ఓవైపు ఉరుములు, మరోవైపు మెరు పులు బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి గాలి, వాన భీభత్సం సృష్టిం చింది. సుమారు రాత్రి 9.15 గంట లైనా వర్షం ఆగలేదు. దీనికితోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టెక్కలిలో అంధకారం నెలకొంది. భారీ ఉరుముల శబ్దాలకు జనం భయాందోళనకు గురయ్యారు. వడగళ్ల వాన కురవడంతో వాహనాలు సైతం ఎక్కడివక్కడే నిలిపివేశారు. గాలి, వాన ప్రభావానికి ఫ్లెక్సీలు, కటౌట్లు ఎగిరి పోయాయి. ఇక రోడ్లుపై ధాన్యం వేసిన రైతులు వర్షానికి నానా అవస్థలు పడ్డారు.
చిరుజల్లులతో చల్లబడ్డ సిక్కోలు
శ్రీకాకుళం, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ఉదయం నుంచి ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోతతో ఇబ్బందులు పడిన సిక్కోలు వాసులకు బుధ వారం రాత్రి పడిన చిరుజల్లులు కొంత ఉపశ మనం కలిగించాయి. ఉరుములు, మెరుపులు, చల్లని గాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఆహ్లాదం కలిగించింది. అలాగే పాతపట్నంలో కూడా వర్షం కురిసింది.