Share News

ఆ స్థలంలో పనులు ఆపండి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:14 PM

మేజర్‌ పంచాయతీ హిరమండ లంలోని కోరాడ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న వివాదస్పద స్థలాన్ని తహసీల్దార్‌ బాలకృష్ణ మంగళవారం పరిశీలించారు.

ఆ స్థలంలో పనులు ఆపండి
చదును చేసిన స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ బాలకృష్ణ

- తహసీల్దార్‌ బాలకృష్ణ

- వివాదస్పద స్థలం పరిశీలన

హిరమండలం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మేజర్‌ పంచాయతీ హిరమండ లంలోని కోరాడ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న వివాదస్పద స్థలాన్ని తహసీల్దార్‌ బాలకృష్ణ మంగళవారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో 212 సర్వే నెంబరులో ఉన్న 81 సెంట్ల స్థలాన్ని 2003లో తనకు ప్రభుత్వం కేటాయించిందంటూ సుభలయ ఆర్‌ఆర్‌కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి బెహర శ్రీనివాసరావు ఇటీవల ప్లాట్లు వేసేందుకు పనులు ప్రారంభించాడు. ఈ పనులను పరిశీలించిన తహసీల్దార్‌ సంబంధిత భూదస్త్రా లను తీసుకురావాలని, అప్పటి వరకు పనులను నిలిపివేయాలని రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగిని ఆదేశించారు. ఉద్యోగ విరమణ తరువాతే సైనిక ఉద్యోగికి ప్రభుత్వ స్థలం మంజూరు చేయాలనే నిబంధన ఉందని, కానీ, సుమారు 15 ఏళ్ల సర్వీ సు ఉంటుండగానే శ్రీనివాసరావుకు 81 సెంట్ల స్థలాన్ని అప్పటి రెవెన్యూ అధికా రులు మంజూరు చేశారని ఇటీవల జేసీకి, టెక్కలి ఆర్డీవోకు జడ్పీటీసీ పి.బుచ్చిబాబు ఫిర్యాదు చేశారు. ఈ స్థలంతో పాటు మండలంలోని గొడియా పాడు రెవెన్యూ పరిధిలో మరో రెండు ఎకరాలు యాభై సెంట్లు స్థలాన్ని శ్రీని వాసరావకు కేటాయించారని దీనిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొ న్నారు. దీంతో కోరాడ రెవెన్యూలోని పీహెచ్‌సీ స్థలంపై వివాదం నెలకొంది.

Updated Date - Jan 06 , 2026 | 11:14 PM