ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:50 PM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని వక్తలు డిమాండ్‌చేశారు.
అరసవల్లి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని వక్తలు డిమాండ్‌చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌లో ఇరాన్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ, ప్రపంచ శాంతిని కోరుతూ జిల్లా పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, అరుణోదయ రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు తదితరులు మాట్లాడుతూ మానవజాతి మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిన యు ద్ధాన్ని ఖండించారు. నాగరిక సమాజంలో ఆధిపత్యం కోసం, సహజ వనరుల దోపిడీకి యుద్ధాలు చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మిస్కా కృష్ణయ్య, మద్దిల వినోద్‌కుమార్, రామారావు, వెంకటరావు, మహిళా సంఘాల నాయకులు నాగమణి, భానుమతి, గీతారాణి, జోగారావు, దానయ్య, వైకుంఠరావు పాల్గొన్నారు.