Share News

సమస్యలపై నిర్లక్ష్యం వీడండి

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:34 PM

నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఆదివారం ఆమదాలవలసలోని శాంతినగర్‌లోని ప్రజా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రవికుమార్‌ ఫోన్‌లో మాట్లాడి సమస్యలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై ఆగ్రహంవ్యక్తం చేశా రు. గ్రామాల్లో పర్యటించిన సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ప్రశ్నిస్తున్నారని, అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేయకుండా కొన్ని విషయాల్లో ఉత్తర్వులు జారీచేయడంపై అసహనం వ్యక్తంచేశారు. పొందూరు మండల రెవన్యూశాఖ క్షేత్రస్థాయి అధికారులు విధి నిర్వ హణలో అలసత్వం చూపుతున్నారని, పనితీరు మారకపోతే జిల్లా అధికారులకు ఫిర్యా దుచేసి చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే రవికుమార్‌ ఫోన్‌లో తహసీల్దార్‌ను హెచ్చ రించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమ్మినేన శ్రీనివాసరావు, బుడుమూరు సూర్యారావు, కోటేశ్వరరావు, మన్మఽథరావు, తోట రాము, గొల్లపల్లి సురేష్‌ పాల్గొన్నారు.

  సమస్యలపై నిర్లక్ష్యం వీడండి
ఆమదాలవలస: అర్జీదారులతో మాట్లాడుతున్న రవికుమార్‌:

ఆమదాలవలస, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఆదివారం ఆమదాలవలసలోని శాంతినగర్‌లోని ప్రజా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రవికుమార్‌ ఫోన్‌లో మాట్లాడి సమస్యలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై ఆగ్రహంవ్యక్తం చేశా రు. గ్రామాల్లో పర్యటించిన సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ప్రశ్నిస్తున్నారని, అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేయకుండా కొన్ని విషయాల్లో ఉత్తర్వులు జారీచేయడంపై అసహనం వ్యక్తంచేశారు. పొందూరు మండల రెవన్యూశాఖ క్షేత్రస్థాయి అధికారులు విధి నిర్వ హణలో అలసత్వం చూపుతున్నారని, పనితీరు మారకపోతే జిల్లా అధికారులకు ఫిర్యా దుచేసి చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే రవికుమార్‌ ఫోన్‌లో తహసీల్దార్‌ను హెచ్చ రించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమ్మినేన శ్రీనివాసరావు, బుడుమూరు సూర్యారావు, కోటేశ్వరరావు, మన్మఽథరావు, తోట రాము, గొల్లపల్లి సురేష్‌ పాల్గొన్నారు.

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా

పొందూరు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్‌ వైద్యసేవ అందని బాఽధితులైన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసాగా నిలుస్తోందని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. ఆదివారం మండలంలోని కింతలిలో సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కును బాధితురాలు దుంపల ప్రవళ్లికకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తారని, అందుకే పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ రూపంలో వైద్యానికి ఆర్థికసహాయం అందిస్తున్నారన్నారు. వైద్యంకోసం పేదలు అధైర్యపడవద్దని, ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా నన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పైడి రామప్రసాద్‌, ఎంపీటీసీ కె.హనుమం తురావు, మాజీ సర్పంచ్‌ డి.గణపతిరావు,అరుణ, లోకనాధం, రామారావు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 11:34 PM