Share News

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:48 PM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వక్తలు తెలిపారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్స వాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు
జలుమూరు: మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి :

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వక్తలు తెలిపారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్స వాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు.

ఫ జలుమూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సామాన్యునికి కార్పొరేట్‌ విద్యనందించి ఆదర్శమైన సమాజం తయారు చేయడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యారంగం బలోపేతానికి అనేక ప్రణాళికలు రూపొందించారని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. కరవంజ ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాలలో13వ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.చిన్నమ్మడు, తహసీల్దార్‌ జె.రామారావు, ఎంపీపీ వాన గోపి, జడ్పీటీసీ మెండ విజయశాంతి, సర్పంచ్‌ జుత్తు నేతాజి, ప్రిన్సిపాల్‌ ఆర్‌.శివకుమార్‌, అప్పలనాయుడు, బలరాం పాల్గొన్నారు.

ఫ పాతపట్నం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. మంగళవారం స్థానిక ఏపీ మోడల్‌స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ కేవీ రత్నకుమారి ఆధ్వర్యంలో జరి గిన వార్షికోత్సవంలో మాట్లాడారు. వార్షికోత్సవం నిర్వహణకు ఉపాధ్యా యు లకు రూ.20 వేలు ఎమ్మెల్యే అందజేశారు. అలాగే పాతపట్నంలోని ప్రభుత్వో న్నత పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు.

Updated Date - Jan 27 , 2026 | 11:48 PM