Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - May 18 , 2026 | 11:46 PM

ప్రజా సమస్యలను తెలు సుకుని వాటిని పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటు న్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎంపీ కలిశెట్టి
అర్జీదారుల సమస్యలు వింటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను తెలు సుకుని వాటిని పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటు న్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సోమవారం చిల్లపేట రాజాం గ్రామంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన అర్జీలను సం బంధిత అధికారులు పరిశీలించి రెండు వారాల్లో గా పరిష్కరించడం జరుగుతుందన్నారు. నారువ, సీహెచ్‌ రాజాంకు సీసీ రోడ్లు మంజూరు చేయా లని మాజీ సర్పంచ్‌ నిద్రబంగి రామకృష్ణ వినతి పత్రం అందించారు.

‘స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం’

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసి దిశగా పనిచేయాలని, అందుకు గ్రామాల్లో కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సోమవారం చిల్లపేట రాజాంలో టీడీపీ క్యాడర్‌తో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ ‘కార్యకర్త అధినేత’ అనే నినాదంతో పార్టీ బలోపేతానికి నిరంతరం అహర్నిశలు శ్రమిస్తు న్నారని, ఈ దిశలో ప్రతీఒక్కరూ పాటుపడా లన్నారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, నేతలు లంక శ్యామలరావు బెండు మల్లేశ్వరరావు, కుమరాపు రవికుమార్‌, మండపాక కనకారావు, బాలబొమ్మ వెంక టేశ్వరరావు, పిన్నింటి భానోజినాయుడు, గాలి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2026 | 11:46 PM