Share News

సకాలంలో విత్తనాలు అందేలా చర్యలు

ABN , Publish Date - May 21 , 2026 | 11:09 PM

రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా సకాలంలో విత్తనాలు, ఎరు వులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ బెందాళం అశోక్‌ తెలిపారు. గురువారం రామయ్యపుట్టుగలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు.

 సకాలంలో విత్తనాలు అందేలా చర్యలు
రైతులకు విత్తనాలు అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, మే 21(ఆంధ్రజ్యోతి): రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా సకాలంలో విత్తనాలు, ఎరు వులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ బెందాళం అశోక్‌ తెలిపారు. గురువారం రామయ్యపుట్టుగలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రియ పద్దతులను అవలంబించి రసాయనాల వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఏవో పి.శ్రీదేవి మాట్లాడుతూ కవిటి మండలానికి కావల్సిన జీలుగు, కట్టెజనుము, పిల్లిపెసర విత్తనాలున సిద్ధంగా ఉంచామన్నారు.

Updated Date - May 21 , 2026 | 11:09 PM