గ్రామాల్లో సురక్షిత నీటి సరఫరాకు చర్యలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:47 PM
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షిత నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తెలిపారు.
పొందూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షిత నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం పొందూరు మేజర్ పంచాయతీలో నీటి వనరులను పరిశీలించారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో డయేరియా తీవ్రంగా ప్రబలిన నేపథ్యంలో పొందూ రులో తాగునీటి వనరులపై దృష్టి సారించాలన్న ఆదే శాల మేరకు పంచాయతీ అధికారులు, సిబ్బందిని అప్ర మత్తం చేశారు. ట్యాంకులు, కుళాయిలు, నీటిసరఫరా కేంద్రాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకో వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ తప్పనిసరిగా క్లోరినేషన్ చేయించాలని, నిబం ధనల మేరకు నీటి పరీ క్షలు చేయాలని, ట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు. విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సురక్షిత నీటిని అం దించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీసీ బాలుర వసతిగృహం, అంగన్‌వాడీ కేంద్రాలకు అందిస్తున్న నీటి ని, అగ్రహారం వీధిలో ఉన్న వాటర్ ట్యాంకును పరిశీ లించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్య క్షుడు సీహెచ్ రామ్మోహన్, డిప్యూటీ ఎంపీడీవో దుంపల అప్పన్న, ఈవోపీఆర్డీ పి.సింహాచలం, పంచాయతీ ఈవో పొన్నాడ జగదీష్, ఆర్‌డబ్యూఎస్ ఏఈ రాజు తది తరులు పాల్గొన్నారు.