సురక్షిత నీరందించేందుకు చర్యలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:18 PM
ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. గురువారం ఎచ్చెర్లలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. గురువారం ఎచ్చెర్లలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనకు అవ సరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, టీడీపీ మండలాధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, కూటమి నేతలు మెండ రాజారావు, మూకళ్ల భాస్కరరావు, సంపతిరావు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పాఠశాలల్లో చేరికలు పెంచాలి
రణస్థలం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచి, ఊరి బడులను కాపాడాల్సిన అవరసం ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం-ఊరి బడిని కాపాడుకుందాం అన్న నినాదంతో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను గురువారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆవిష్కరించారు.