పెద్ద మార్కెట్ అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:35 PM
పెద్దమార్కెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
అరసవల్లి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): పెద్దమార్కెట్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించారు. లాగే స్థానిక పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి మేదర వీధి మీదుగా రంగిరీజు వీధి వరకు రూ.52లక్షలతో నిర్మించనున్న రోడ్డుకు గురు వారం శంకుస్థాపన చేశారు. అలాగే నగరంలోని ఆర్జీసీ కాంప్లెక్స్ దరి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. పాలకొండ రోడ్డు విస్తరణలో నివాసితులకు ఇబ్బంది లేకుండాపనులను వేగవంతంగా చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీకాకుళంలోని రహదా రులను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్ ఇన్‌చార్జి కమిషనర్ కమలాకర్, ఇంజినీరింగ్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
x