Share News

ఖరీఫ్‌లో ఎరువుల కొరత లేకుండా చర్యలు: జేడీఏ

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:51 PM

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎరు వుల కొరత లేకుండా బఫర్‌ స్టాక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ వైవీ మురళీకృష్ణ ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎరు వుల కొరత లేకుండా బఫర్‌ స్టాక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలజిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎరు వుల కొరత లేకుండా బఫర్‌ స్టాక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ వైవీ మురళీకృష్ణ ఆదేశించారు.

 ఖరీఫ్‌లో ఎరువుల కొరత లేకుండా చర్యలు: జేడీఏ
మాట్లాడుతున్న జేడీఏ వైవీ మురళీకృష్ణ

పాత శ్రీకాకుళం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎరు వుల కొరత లేకుండా బఫర్‌ స్టాక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ వైవీ మురళీకృష్ణ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో 2026-27 సీజన్‌కు సంబంధించి ఎరువుల సరఫరా, వినియోగంపై కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు. హోల్‌సేల్‌, మ్యాను ఫ్యాక్చరర్లు, వివిధ ఎరువుల కంపెనీల ప్రతినిధులు, మార్క్‌ఫెడ్‌ అధికారులు, ఏవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా వినియోగాన్ని తగ్గించేం దుకు రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. పచ్చిరొట పంటలను తొక్కివేయడం, జీవ ఎరువుల వినియోగం పెంపు ద్వారా యూరియా వినియోగాన్ని 25 శాతం వరకు తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. జీవ ఎరువుల వినియోగంపై అవగాహన, నానో ఎరువుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించారు. ఎరువుల ధరలను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:51 PM