Share News

గంగాసాగరం రిజర్వాయర్‌ అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:13 AM

జలంత్రకోట పంచాయతీ పరిధి గంగాసాగరం రిజర్వాయర్‌ను పలాస ఆర్డీవో అప్పలరాజు సోమవారం పరిశీలించారు.

గంగాసాగరం రిజర్వాయర్‌ అభివృద్ధికి చర్యలు
రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో అప్పలరాజు

కంచిలి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): జలంత్రకోట పంచాయతీ పరిధి గంగాసాగరం రిజర్వాయర్‌ను పలాస ఆర్డీవో అప్పలరాజు సోమవారం పరిశీలించారు. రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చే అవకాశాలను స్థానిక అధికారులను అడిగి తెలసుకున్నారు. రిజర్వాయర్‌ దిగువన ఉన్న ఆయకట్టు వివరాలు సేక రించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార మిషన్‌లో భాగంగా రిజర్వాయర్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌, ఎంపీడీవో వి.తిరుమలరావు, ఇరిగేషన్‌ జేఈ రమణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:13 AM