పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి చర్యలు
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:40 PM
తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు అందచేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తహసీల్దార్ జె.రామారావు తెలిపారు.
జలుమూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు అందచేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తహసీల్దార్ జె.రామారావు తెలిపారు. సోమవారం మహమ్మద్‌పురంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ తర్ర నాగేశ్వరరావు, వీఆర్వో సింహాచలం, టీడీపీ నాయకులు మొయ్యి శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సింహాచలం పాల్గొన్నారు.