భద్రం కోనేరు అభివృద్ధికి చర్యలు: శిరీష
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:16 AM
ఉల్లాస పేట కాలనీలో గల భద్రం కోనేరు అభివృది ్ధకి చర్యలు తీసు కుంటా మని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
పలాస, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఉల్లాస పేట కాలనీలో గల భద్రం కోనేరు అభివృది ్ధకి చర్యలు తీసు కుంటా మని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. బుధ వారం రూ.28 లక్షలతో నిర్మించిన కోనేరు ప్రహరీని ప్రారంభించారు. రూ.16 లక్షలతో రైతు శిక్షణ కేంద్రం నుంచి అమ్మవారి ఆలయం వరకు రహదారి నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. 27వ వార్డు శ్రీనివాస నగర్‌లో ఏర్పాటు చేసిన పవర్‌బోరును, పీ-4లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.15 లక్షలతో నిర్మించిన ఓపెన్ ఆడిటో రియాన్ని ప్రారంభించారు. ప్రవాసాంధ్రుడు డాక్టర్ కణితి హేమాచలం దీనికి నిధు లు వెచ్చించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు, కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బడ్డ నాగరాజు, సప్ప నవీన్, ఎం.నరేంద్ర, డొక్కరి శంకర్, దడియాల నర్సింహులు, జోగ మల్లి, మోహనరావు పాల్గొన్నారు.