Share News

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:55 PM

ప్రజల నుంచి వచ్చే అర్జీల ను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకో వాలని ఏఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశించారు.

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఏఎస్పీ శ్రీనివాసరావు

ఏఎస్పీ శ్రీనివాసరావు

శ్రీకాకుళం క్రైం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే అర్జీల ను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకో వాలని ఏఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పబ్లిక్‌ గ్రీవెన్స్‌ను నిర్వహించి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 70 ఫిర్యాదులను స్వీక రించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్‌శాఖ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికను అందించాలన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:55 PM