Share News

సమగ్ర పాడి అభివృద్ధికి చర్యలు: రవికుమార్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:02 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వ ర్యంలో సమగ్ర పాడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

సమగ్ర పాడి అభివృద్ధికి చర్యలు: రవికుమార్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వ ర్యంలో సమగ్ర పాడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. పట్టణంలోని పశు సంవర్థక శాఖ కార్యాల యంలో రైతు శిక్షణ, పాడి పరిశ్రమాభి వృద్ధి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు బిడ్డ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పాడి పరిశ్రమ పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శిం చారు. అనంతరం పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దూడ ల ప్రదర్శనను తిలకిం చారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ ఏడీ నారాయణరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మి నేని గీతాసాగర్‌, నాయకులు డాక్టర్‌ చాపర సుధాకర్‌, మాధవి, సునీత, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:02 AM