Share News

అప్రమత్తమై.. ప్రాణాలు కాపాడి

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:39 PM

రైల్వే లోకో పైలట్‌ అప్రమత్తంగా వ్యవహ రించి ఓ విద్యార్థిని ప్రాణాలు కాపాడిన ఘటన పాతపట్నం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుం ది.

అప్రమత్తమై.. ప్రాణాలు కాపాడి
స్వల్ప గాయాలతో బయటపడిన రామజ్యోతి

- సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌ దాటిన విద్యార్థిని

- గుర్తించి రైలుకు సడన్‌ బ్రేక్‌ వేసిన లోకో పైలట్‌

-స్వల్పగాయాలతో బయటపడిన బాలిక

పాతపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రైల్వే లోకో పైలట్‌ అప్రమత్తంగా వ్యవహ రించి ఓ విద్యార్థిని ప్రాణాలు కాపాడిన ఘటన పాతపట్నం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుం ది. హిరమండలం మండలం కల్లట గ్రామానికి చెందిన బురల్ల రామజ్యోతి అనే బాలిక స్థానిక ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదు వుతోంది. సోమవారం ఉదయం పాతప ట్నం రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఈక్రమంలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా అదే సమయంలో ఆ మార్గంలో విశాఖ- గుణుపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ వస్తుంది. విద్యార్థినిని చూసిన లోకో పైలట్‌ అప్ర మత్తమై సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో స్వల్పగాయాలతో విద్యార్థిని బయట పడింది. ఆమెను స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. లోకో పైలట్‌ను స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.

Updated Date - Aug 03 , 2026 | 11:39 PM