Share News

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: డీఎస్పీ

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:01 AM

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాశీబుగ్గ డీఎస్పీ భవాని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో బాలికల భద్రతకు చర్యలేవని అధికారులను ప్రశ్నించారు. ఆదివారం మందస మండలంలోని పట్టులోగాం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు బోఽధించి పలు ప్రశ్నలు అడిగితెలుసుకున్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: డీఎస్పీ
మాట్లాడుతున్న డీఎస్పీ భవాని..

హరిపురం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాశీబుగ్గ డీఎస్పీ భవాని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో బాలికల భద్రతకు చర్యలేవని అధికారులను ప్రశ్నించారు. ఆదివారం మందస మండలంలోని పట్టులోగాం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు బోఽధించి పలు ప్రశ్నలు అడిగితెలుసుకున్నారు. అనంతరం భద్రతా చర్యలపై ఆరాతీయగా పాఠశాలకు సీసీ కెమెరాలు లేవని విద్యార్థుల ద్వారా గుర్తించారు. ఉపాధ్యాయులను సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. పోలీసుశాఖ ద్వారా రెండురోజుల్లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం పట్టులోగాం గ్రామస్థులతో మాట్లాడారు. అనంతరం 30మంది వృద్థులకు గొడుగులు అందజేశారు. కార్యక్రమంలో సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌, హెచ్‌ఎం శారద పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:01 AM