Share News

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : ఏఎస్పీ

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:26 PM

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ కేవీ రమణ కోరారు. గురువారం ఎచ్చెర్లలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగా హన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ జె.లక్ష్మణరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగోజీ పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : ఏఎస్పీ
ఎచ్చెర్ల: ర్యాలీ నిర్వహిస్తున్న అడిషనల్‌ ఎస్పీ కేవీ రమణ ::

ఎచ్చెర్ల, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అదనపు ఎస్పీ కేవీ రమణ కోరారు. గురువారం ఎచ్చెర్లలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగా హన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ జె.లక్ష్మణరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగోజీ పాల్గొన్నారు.

ఫ శ్రీకాకుళం లీగల్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరం గా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్య దర్శి కె.హరిబాబు కోరారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహిం చారు. మెడికల్‌కళాశాల ఆవరణలో లీగల్‌ లిటరసీ క్లబ్‌ను ఏర్పాటుచేసి పారాలీగల్‌ వలంటీర్‌ని నియమించారు. కార్యక్రమంలో డి.ఈశ్వరరావు, టి.అఖిల పాల్గొన్నారు

ఫఆమదాలవలస, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద పిలుపునిచ్చారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. కార్య క్రమంలో ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సేపాన కాంతారావు పాల్గొన్నారు.

ఫ కంచిలి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): యువత మాదకద్రవ్యాల జోలికిపోవద్దని, మత్తులో పడితే భవిష్యత్‌ అంధకారం అవుతుందని ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఉరిటి జగదీష్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ పివో ఎన్‌కే దాస్‌, ఈగల్‌ టీం సభ్యుడు గార వేణుగోపాలరావు పాల్గొన్నారు.

ఫఇచ్ఛాపురం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.మధుకుమార్‌ కోరారు. గురువారం ఇచ్ఛాపురంలో మాదక ద్రవ్య వ్యతిరేక ప్రచారం కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.కృష్ణారావు, చాట్ల తులసీదాస్‌రెడ్డి, జయప్రకాష్‌, రాము పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:26 PM