తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:56 PM
తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో కె. సాయిప్రత్యూష అన్నారు.
ఆర్డీవో సాయి ప్రత్యూష
రణస్థలం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో కె. సాయిప్రత్యూష అన్నారు. సోమవారం దోనిపేట గ్రామం లో ఆమె పర్యటించి మత్స్యకారులకు పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదన్నారు. గర్భి ణులు, బాలింతలు అత్యవసర వైద్య సాయం అవసరమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచు కుని అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు తరలివెళ్లాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాల న్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సుగుణా కరరావు, తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, ఏడీ బి. దుర్గారావు, ఎస్‌ఐ వి.సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రజలను అప్రమత్తం చేయండి: డీపీవో
గార, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేప థ్యంలో మండలస్థాయి అధికారులు అప్రమత్తమై ప్రజల కు అందు బాటులో ఉండాలని జిల్లా పంచాయతీ అధి కారి ఆర్.స్వరూపారాణి అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సముద్ర, నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, తుఫాన్ హెచ్చరిక లను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. సమావేశంలో పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్ చక్రవర్తి, ఎస్‌ఐ సీహెచ్ గంగరాజు సోమవారం మత్స్యకార గ్రామమైన బందరు వానిపేటలో పర్యటించి తుఫాన్ ప్రభావంపై స్థానికు లకు అవగాహన కలిగించారు.
అధికారుల సూచనలు పాటించాలి
ఇచ్ఛాపురం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధి కారుల సూచనలు పాటించాలని తహసీల్దార్ వెంకట్రావు అన్నారు. ఈ మేరకు సోమవారం డొంకూరు గ్రామంలో అగ్నిమాపక శాఖాధికారులతో కలిసి ప్రజల ను అప్రమత్తం చేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు.