2 నుంచి రాష్ట్రస్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:53 PM
రాష్ట్రస్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలను శ్రీకాకుళంలో ఆగస్టు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసి డెంట్ గూడేన సోమేశ్వరరావు తెలిపారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలను శ్రీకాకుళంలో ఆగస్టు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసి డెంట్ గూడేన సోమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం శాంతి నగర్ కాలనీలోని జిల్లా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 156 మంది క్రీడాకారులు పాల్గొంటారని, అదేవిధంగా పోటీల అఫీషియల్స్ వస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఏ రావు, మెట్ట అశోక్‌కుమార్, సీఈవో సూరిబాబు పాల్గొన్నారు.