రైతు సంక్షేమంతో రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:49 AM
రైతు సంక్షేమంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం మునిసిపాలిటీలోని 23వ వార్డు వెంకయ్యపేటలో 300 మంది ఇనాం భూ ముల రైతులకు మంజూరైన ‘అన్నదాత సుఖీభవ’ ను పంపిణీ చేశారు. అంతకు ముందు గ్రామంలో నిర్మించిన సీసీ రహదారిన, పాఠశాల ప్రహ రీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మట్టిని నమ్ముకొని నిత్యం శ్రమజీవిగా పాటుపడుతూ ఆహార ధాన్యాలు అందిస్తున్న రైతు కు అన్ని విధాలా సంక్షేమంగా ఉండాలని ముఖ్యమత్రి చంద్ర బాబు నాయుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఇనాం భూముల రైతులకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. అన్నదాత సుఖీభవ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రవికుమార్‌ను పీఏసీఎస్ అధ్యక్షురాలు శిమ్మ మాధవి ఆధ్వర్యంలో సత్క రించారు. కార్యక్రమంలో మునిసిపల్ మాఈ చైర్‌పర్సన్ తమ్మి నేని గీతా విద్యాసాగర్, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు టి. సుజాత, జనసేన నేత రామ్మోహన్, బీజేపీ కన్వీనర్ సూరపు నాయుడు, టీడీపీ నాయ కులు చంద్రశేఖర్, విజయలక్ష్మి, మురళీధర్, కమిషనర్ రవి, ఏవో మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రవికుమార్‌కు సత్కారం
రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను టీడీపీ అధిష్టానం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడంపై జిల్లా టీడీపీ సాధికారిత కమిటీ సభ్యుడు, రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి నాగళ్ల మురళీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేని మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యా సాగర్ ఆధ్వర్యంలో నాయకులు పూలమాల లతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే రవికుమార్ కృషి చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. టీడీపీ నాయకులు గురుగుబెల్లి మురళి, కారుణ్య ధర్మారావు, మునగవలస రవీంద్ర, బరాటం వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.