Share News

కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - May 02 , 2026 | 12:04 AM

కేంద్రప్రభుత్వ సాయంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధి
కవిటి: కరాపాడులో రైల్వే ఫుట్‌బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

కవిటి/కంచిలి, మే 1(ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వ సాయంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. కరాపాడు, జాడుపూడి ఆర్‌ఎస్‌ వద్ద నిర్మించ నున్న ఆర్వోబీకి శంకుస్థాపన, పుట్‌ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. అనంతరం కంచిలి మండలం బసవ పుట్టుగ గ్రామంలో కేంద్రమంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కలయికతో ప్రజలంతా కూటమికి పట్టం కట్టారన్నారు. అందుకు తగిన విధం గా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇచ్ఛాపురం నియో జకవర్గమంటే తనకు ఎప్పుడూ ప్రత్యేక అభిమానమని, అందుకు తగిన విధంగా జాడుపూడి ఆర్‌ఎస్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, రైల్వే డీఆర్‌ఎం డి.సునీల్‌ కుట్టి, సీఏవో జోసెఫ్‌, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, నేతలు పాల్గొన్నారు.

‘సోలార్‌ లైట్లతో మేలు’

సోంపేట రూరల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): సముద్రతీర ప్రాంతాల్లో సోలార్‌ వెలుగులను ఏర్పాటు చేసేందుకు మత్స్యసాగరమాల పథకం అమలు చేశామని, దీనివల్ల మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి ఎర్రముక్కాం, ఎకువూరు మత్స్యకార గ్రామాల్లో పర్యటించి కోల్‌ ఇండియా సౌజన్యంతో ఏర్పాటు చేసిన సోలార్‌ లైట్లను ప్రారంభించారు. ఎర్రముక్కాం నేతాజీ రాక్‌ బీచ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమ స్యలు ప్రత్యక్షంగా చూసిన తర్వాత రాత్రివేళల్లో ఇబ్బందులు పడ కూడదనే ఆలోచనతో జిల్లాలోని వంద మత్స్యకార గ్రామాల్లో 2,800 సోలార్‌ లైట్లు అవసరమని గుర్తించి ఇప్పటికే 1600 లైట్లు వేశామని, సీసీ రోడ్లు నిర్మించామన్నారు. మిగిలిన లైట్లను త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు. దీనికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, మత్స్యశాఖాధికారులు పూర్తి సహకారం అందించారని పేర్కొ న్నారు. సోలార్‌ లైట్లు వల్ల రాత్రి వేళల్లో మత్స్యకారులు సురక్షితం గా చేపల వేటకు వెళ్లి రాగలుగుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర రూపు రేఖలు త్వరలోనే మారబోతున్నాయని మంత్రి ఆశా భావం వ్యక్తం చేశారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని, స్థానిక యువతకు పెద్దపీట దక్కు తుందన్నారు. నడుమూరు గ్రామంలో పల్లెనిద్ర నిర్వహించి స్థాని కుల సమస్యలపై మత్స్యకారులతో సదీర్ఘంగా చర్చించారు. కార్యక్ర మంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, జనసేన నాయకుడు దాసరి రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్‌, మత్స్య శాఖాధి కారులు, మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:04 AM