Share News

డిగ్రీ తరగతులు ప్రారంభించండి

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:17 AM

మండలానికి డిగ్రీ కళాశాల మంజూ రైనందున ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.

డిగ్రీ తరగతులు ప్రారంభించండి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): మండలానికి డిగ్రీ కళాశాల మంజూ రైనందున ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. బుధవారం కలెక్టర్‌ స్విప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాత్కాలి కంగా స్థానిక జూనియర్‌ కళాశాల భవనాల్లోనే తరగతులు కొనసాగించాల న్నారు. కొత్త భవనాలు నిర్మించేందుకు 3.5 ఎకరాలు గుర్తించడం జరిగిందని, వాటిలో నూతన భవనాలు నిర్మించడం జరుగుతుందన్నారు. అంతవరకు జూని యర్‌ కళాశాల భవనాల్లోనే తాత్కాలికంగా డిగ్రీ తరగతులు నిర్వహించాలని సూచించారు. నాలుగు విభాగాల్లో కోర్సులు ఉన్నాయని, మొత్తం 160 సీట్లు అందుబాటులో ఉంటాయని మంత్రికి ప్రిన్సిపాల్‌ గోవిందమ్మ వివరించారు. అన్ని సీట్లు భర్తీ అయ్యేలా అధ్యాపకులు కృషి చేయాలని మంత్రి సూచించారు. డిగ్రీ చదివేందుకు సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండల విద్యార్థులు టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేదని ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదని మంత్రి వివరించారు. సమావేశంలో టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, తహసీల్దార్‌ ప్రసాదరావు, పార్టీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:17 AM