Share News

వైసీపీ హయాంలో కుంటుపడిన అభివృద్ధి

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:50 PM

రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

వైసీపీ హయాంలో కుంటుపడిన అభివృద్ధి
తాళ్లవలసలో రహదారులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం రాత్రి మండలంలోని తాళ్లవలస, చిల్లపేట, రెయ్యపేట గ్రామాల్లో రూ.2 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంతో ప్రస్తుతం గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2014-19 మధ్యలో నిలిచిపోయిన పనులకు బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టెక్కలి నియోజక వర్గంలో రూ.600 కోటతో ఇంటింటికీ నీరు అందిస్తామ న్నారు. తాళ్లవలసలో రక్షిత మంచినీటి పథకానికి, రెయ్యిపేట- సాకిపల్లి రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, పీఏసీఎస్‌ చైర్శన్‌ కూచెట్టి కాంతారావు, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ బాడాన ర మణమ్మ, గోపాల్‌, నాగభూషణం పా ల్గొన్నారు.

అన్నా క్యాంటీన్‌ పరిశీలన

కోటబొమ్మాళి, జన వరి 31(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్‌ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శని వారం పరిశీ లించారు. భోజనం నాణ్యత, నిర్వహణ తీరును పరిశీలించి... అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడారు. రూ. 5కే 500 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించటం సంతోషంగా ఉందని వారు మంత్రికి వివరించారు. పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, అన్నక్యాంటీన్‌ నిర్వహకులు లాడి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 11:50 PM