ఓట్ల లెక్కింపుపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:52 PM
ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల ఆవ రణలో శనివారం నిర్వహించనున్న మండల, జిల్లా ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గరుగుబిల్లి మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.వాణి శైలజ సూచించారు.
గరుగుబిల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల ఆవ రణలో శనివారం నిర్వహించనున్న మండల, జిల్లా ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గరుగుబిల్లి మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.వాణి శైలజ సూచించారు. శుక్రవారం ఉద్యాన కళాశాల పరిధిలో పీవో, ఏపీవోలు, లెక్కింపు సిబ్బందికి అవగాహనకల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేసేం దుకు దృష్టి సారించాలని తెలిపారు. లెక్కింపు సమయంలో పొరపాట్లకు తావులేకుండా వ్యవహరించాలని కోరారు. ఎన్నికలసంఘం విధించిన నియ మావళి మేరకు వ్యవహరించాలని తెలిపారు. లెక్కింపుసమయంలో సెల్‌ఫోన్లు నిషేధించినట్లు చెప్పారు. లెక్కింపు పూర్తయ్యే వరకు సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా దృష్టి సారించాలని తెలి పారు. లెక్కింపు ప్రక్రియను రెండువిడతల్లో పూర్తిచేస్తామని చెప్పారు. ప్రాదే శికాలు వారీగా లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రక టిస్తామని తెలిపారు. లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం ఏడుగంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. సిబ్బంది గుర్తింపుకార్డులతో విధులకు హాజరుకావాలని కోరారు. నిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.సమావేశంలో ఏఆర్‌వోలు పి.బాల, ఎన్.సూర్యనారా యణ, ఎల్.గోపాలరావు, ఎం.వెంకటేశ్వరరావు, శిక్షకులు కె.మురళీమోహన్, బి.రవికుమార్, వై.శంకరరావు పాల్గొన్నారు.