Share News

అద్దె భవనాలతో సిబ్బందికి అగచాట్లు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:03 AM

టెక్కలిలోని పలుప్రభుత్వ శాఖల కార్యాలయాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. నెలవారీ వేలాది రూపాయలు అద్దె చెల్లిస్తున్నా సరిపడ వసతులు లేకపోవడంతో సిబ్బంది, పనులపై వచ్చే వారు ఇబ్బందిపడుతున్నారు. ఈనేప థ్యంలో ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడుతోంది.

అద్దె భవనాలతో సిబ్బందికి అగచాట్లు
టెక్కలిలో అద్దెభవనంలో నిర్వహిస్తున్న గనులశాఖ కార్యాలయం :

టెక్కలి, జనవరి 19(ఆంద్రజ్యోతి): టెక్కలిలోని పలుప్రభుత్వ శాఖల కార్యాలయాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. నెలవారీ వేలాది రూపాయలు అద్దె చెల్లిస్తున్నా సరిపడ వసతులు లేకపోవడంతో సిబ్బంది, పనులపై వచ్చే వారు ఇబ్బందిపడుతున్నారు. ఈనేప థ్యంలో ప్రభుత్వ ఖజానాకు కూడా గండిపడుతోంది. ఎక్సైజ్‌, గనులుభూగర్భశాఖ, ఐసీడీఎస్‌, కార్మిక, గణాంక శాఖకార్యాలయాలు, కోఆపరేటివ్‌ సహకార రిజిస్ర్టార్‌ కార్యాలయంతోపాటు ఎన్టీఆర్‌ కాలనీలో సచివాలయం తదితర ప్రభుత్వశాఖలు అద్దెభవనాల్లో నిర్వహిస్తు న్నారు. ఇప్పటికే పలుప్రభుత్వశాఖలకు మంత్రి కింజ రాపు అచ్చెంనాయుడు భవనాలునిర్మించేందుకు చర్యలు తీసుకోగా, మరికొన్ని శాఖలకు మాత్రమే సొంత భవ నాల సమస్య నెలకొంది. 1994లో ఎన్టీరామారావు టెక్క లి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాల యాలు ఒకేచోటఉండేలా నిర్మించాలని చేసిన ప్రతిపాద నలు అటకెక్కాయి. ఆ తర్వాత పాత జిల్లా కేంద్రాసుప త్రి, వంశధార కార్యాలయం దరి కొత్తగా నిర్మాణాలు చేపట్టడంతో పాత ఆసుపత్రికి చెందిన పలుభవనాలు పలుప్రభుత్వశాఖలకు కేటాయించేందుకు మంత్రి అచ్చె న్నాయుడు ఆదేశాల మేరకు ప్రయత్నాలుజరిగాయి. అయితే అవసరమైన నిర్మాణాలకు వ్యయం పెరుగు తుందని భావించి పాత ఆసుపత్రిభవనాలు విడిచిపె ట్టేశారు. దీంతో పలు ప్రభుత్వ శాఖలు అద్దె ప్రాతిపది కన ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. టెక్కలిలో కొత్తగా పలుప్రభుత్వ కార్యాలయాల నిర్మా ణాలు చేప డితేనే అద్దెకార్యాలయాల సమస్య అధిగమించే వీలుం టుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 20 , 2026 | 12:03 AM