మూడు నెలల్లో స్టేడియం పనులు పూర్తి
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:47 PM
జిల్లా కేంద్రం లోని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తి చేసి క్రీడాకారు లకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూలై 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం లోని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తి చేసి క్రీడాకారు లకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం స్థాని క శాంతినగర్ కాలనీలోని ఇండో ర్ స్టేడియంలో జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేడియం పనులకు సం బంధించి ఇటీవలే రూ.5 కోట్లు పెండింగ్ బకా యిలు చెల్లించామని, ఇండోర్ స్డేడియం పెండిం గ్ పనులు ఉన్నాయన్నారు. రూ.9 కోట్ల నిధులతో స్టేడియం గ్యాలరీ నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ చురుకైన పాత్ర పోషిస్తుందని, తమ వంతు సాయం అందిస్తానన్నారు. పోటీల్లో క్రీడా స్ఫూర్తి ని ప్రదర్శించాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ.. జిల్లాలో బ్యాడ్మిం టన్ అభివృద్ధికి సంఘం కృషి అభినందనీయ మన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలకుజిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమం లో .జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఆర్.రాజేంద్రన్, అధ్యక్షుడు కె.సాగర్, కార్యదర్శి ఎం.అశోక్ కుమార్, ఎన్‌వీ కిరణ్‌కుమార్, బి. దామోదరరావు, కేఎస్.మదీనా శైలానీ, సంపతి రావు సూరిబాబు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం తదితరులు పాల్గొన్నారు.
అస్వస్థతకు గురైన విద్యార్థినులకు పరామర్శ
గార, జూలై 11 (ఆంధ్రజ్యోతి): శాలిహుండాంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో డయేరియాతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యం లో ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం పాఠశాలను సందర్శించారు. విద్యా ర్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారి సోని యాతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు త్వరితగతిన కోలుకునేలా అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. తరగతి గదులు, వంటగది, స్టోర్‌రూం, ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించారు. పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం వండి వడ్డించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ఆహార నాణ్యతను పరిశీలించారు కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యుడు గుండ భాస్కర రావు, మాజీ సర్పంచ్ కె.ఆదినారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పీస వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.