కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:00 AM
Srirama navami vibes జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రామమందిరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పల్లెలు.. పట్టణాలు.. ఎక్కడ చూసినా శ్రీరామ నామస్మరణ మార్మోగింది.
వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
అరసవల్లి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రామమందిరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పల్లెలు.. పట్టణాలు.. ఎక్కడ చూసినా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. శ్రీరాముడి కల్యాణం కమనీయంగా సాగింది. శ్రీకాకుళంలోని పాలకొండ రోడ్డులో ప్రసిద్ధి చెందిన శ్రీకోదండరామాలయంలో ఘనంగా సీతారాముడి కల్యాణ వేడుకలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు బారులుదీరి స్వామిని దర్శించుకుని.. కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు.