Share News

శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:44 PM

శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం
శ్రీముఖలింగం గ్రామోత్సవంలో స్వామివారికి పూజలు చేస్తున్న భక్తులు

జలుమూరు, మార్చి 15(ఆంధ్ర జ్యోతి): శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఫాల్గుణమాసం బహుళ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసారు. సాయంత్రం గర్భగుడిలో గల పార్వతీ పరమేశ్వరులు ఉత్సవ విగ్రహాలను బయటకు తెచ్చి పల్లకిలో ఆసీనులను చేశారు. మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాల నడుమ పార్వతీ పరమేశ్వరుల గ్రామోత్సవం నిర్వహించారు. ఈవో ఏడుకొండలు, పాలకమండలి చైర్మన్‌ శివ ప్రసాద్‌ పాడి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:44 PM