జాతీయ స్థాయిలో మెరిసిన శ్రీకాకుళం
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:45 PM
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026’లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో సత్తా చాటింది.
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో 11వ ర్యాంక్
శ్రీకాకుళం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026’లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) కింద నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక సర్వేలో నగరపాలక సంస్థకు అరుదైన గుర్తింపు లభించింది. మూడు లక్షల లోపు జనాభా ఉన్న నగరాల విభాగంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) జాతీయ స్థాయిలో 11వ ర్యాంకును కైవసం చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచి గర్వకారణంగా నిలిచింది. ప్రజల సహ కారంతో పాటు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది వల్లే ఈ గుర్తిం పు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ జి.శ్రవణ్ కుమార్ తెలిపారు.
నగరానికి రూ.11 కోట్లతో
స్వచ్ఛ వాయు ప్రాజెక్టు
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నగరంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రించి గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు జాతీ య స్వచ్ఛ వాయు పథకం కింద రూ.11 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు కార్పొరేషన్ కమిషనర్ జి.శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వ ర్యంలో ఈ ప్రాజెక్టు నిధులను మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేప ట్టేందుకు ప్రణాళి కలు రూపొందించారన్నారు. దుమ్ము, ధూళి, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం, పచ్చదనం పెం పొందించడం, శాస్ర్తీయ వ్యర్థ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వనున్నా రన్నారు. గతంలో స్మార్ట్ సిటీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన కాలు ష్య నియంత్రణ చర్యలను విస్తృతంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.