సిక్కోలు.. జనసంద్రం
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:10 AM
Sankranti time.. crowded సిక్కోలుకు సంక్రాంతి శోభ వచ్చేసింది. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలసజీవులు స్వగ్రామాలకు తరలివస్తున్నారు. కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతి వేళ.. ఎక్కడ చూసినా రద్దీ
అరసవల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సిక్కోలుకు సంక్రాంతి శోభ వచ్చేసింది. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలసజీవులు స్వగ్రామాలకు తరలివస్తున్నారు. కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు పండుగను పురస్కరించుకుని కొత్త వస్తువులు, నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారితో సిక్కోలు నగరం జనసంద్రమైంది. స్థానిక జీటీ రోడ్డులో రహదారికి ఇరువైపులా ప్లాట్‌ఫారాలపై వస్త్ర దుకాణాల్లో ఎక్కడ చూసినా రద్దీ కనిపించింది. నడిచేందుకు కూడా చోటు లేక వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ రహదారిలో కార్లు, ఆటోలను అనుమతించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.