శ్రీకాకుళం ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ బదిలీ
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:52 PM
జిల్లా ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న బి.రాంబాబు బదిలీ అయ్యారు. ఆయనను విజయ నగరం జిల్లాకు రెగ్యులర్ ప్రాతిపదికన బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులు జారీచేసింది.
విజయనగరానికి పంపుతూ ఉత్తర్వులు
శ్రీకాకుళం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న బి.రాంబాబు బదిలీ అయ్యారు. ఆయనను విజయ నగరం జిల్లాకు రెగ్యులర్ ప్రాతిపదికన బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులు జారీచేసింది. ఈ మేరకు కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు జీవోఆర్టీ 108ను విడుదల చేశారు. రాష్ట్రం లో ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలపై నిషే ధం అమలులో ఉన్నప్పటికీ పరిపాలనా పరమైన కారణాల దృష్ట్యా ఆ బదిలీల నిషేధాన్ని సడలిస్తూ ఈ నిర్ణయం తీసు కున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదే శాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితోనే ఈ బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ బదిలీకి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (ఏపీ)ను ప్రభుత్వం ఆదేశించింది.