పర్యాటక కేంద్రంగా శ్రీకాకుళం తీరం
ABN , Publish Date - May 04 , 2026 | 12:13 AM
శ్రీకాకుళం నియోజకవర్గ తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా అరుదైన జీవజాతుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాబేళ్ల సంరక్షణ
శ్రీకాకుళం రూరల్, మే 3(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నియోజకవర్గ తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా అరుదైన జీవజాతుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు కుందువానిపేటలో ఆదివారం ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ పెంచుతున్న తాబేలు గుడ్లను పొదిగిన పిల్లలను సము ద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రతి ఏటా ఈ అరుదైన తాబేళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెడుతుంటాయని, అటవీశాఖ, ట్రీ ఫౌండే షన్ సంరక్షిస్తుంటారన్నారు. సుమారు 25 వేల తాబేళ్ల పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టడం ఆనందం వ్యక్తంచేశారు. తాబేళ్ల పిల్లలను సంరక్షిస్తున్న అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు. కుందువానిపేట తీరంలోని సహజ సిద్ధమైన అందా లను పర్యాటకంగా మార్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం సహ కారంతో హ్యాచరీలను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మారిస్తే యువత కు ఉపాధి అవకాశాలు కలుగుతా యన్నారు. రానున్న రోజుల్లో వన్య ప్రాణులకు సంరక్షణతో పాటు తీర ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక లు రూపొందిస్తామన్నారు. శ్రీకాకుళం అటవీ రేంజ్ అధికారి ఆర్.రాజశేఖర్ మాట్లాడు తూ.. తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ గుడ్లను సుర క్షితంగా హ్యాచరీల్లో భద్రపరిచి పొదిగిన పిల్లలను ఎటువంటి ప్రమా దం లేకుండా సముద్రంలో విడిచి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్య క్రమంలో ఎఫ్‌ఎస్‌వోలు బి.అరుణ కుమారి, చక్రధరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు మూకళ్ల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సూరాడ అప్పన్న, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.