Share News

శ్రీకాకుళం 483.. ఆమదాలవలస 154

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:22 AM

More nominations on the final day శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రెండుచోట్లా చివరి రోజు నామినేషన్ల కోలాహలం కనిపించింది. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, అనుచరులు పెద్దఎత్తున నామినేషన్లకు తరలివచ్చారు.

శ్రీకాకుళం 483.. ఆమదాలవలస 154
శ్రీకాకుళంలో మేయర్‌ స్థానానికి నామినేషన్‌ వేస్తున్న జనసేన అభ్యర్థి దానేటి రాధారాణి, చిత్రంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, డాక్టర్‌ దానేటి శ్రీధర్‌

  • చివరి రోజు పోటెత్తిన నామినేషన్లు

  • శ్రీకాకుళంలో జనసేన నుంచి రాధారాణి, వైసీపీ నుంచి లక్ష్మీదేవి

  • కార్పొరేటర్ల స్థానాలకు భారీ సంఖ్యలో..

  • శ్రీకాకుళం/ ఆమదాలవలస, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రెండుచోట్లా చివరి రోజు నామినేషన్ల కోలాహలం కనిపించింది. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, అనుచరులు పెద్దఎత్తున నామినేషన్లకు తరలివచ్చారు. ఈ మూడు రోజుల్లో శ్రీకాకుళం కార్పొరేషన్‌లో మేయర్‌, 60 డివిజన్ల కార్పొరేటర్‌ స్థానాలకు మొత్తం 483 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన సోమవారం ఒక్కరోజే 388 నామినేషన్‌ పత్రాలు అందాయి.

  • మేయర్‌ పదవికి సంబంధించి కూటమి తరఫున జనసేన అభ్యర్థి దానేటి రాధారాణి, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కాగా తొలిరోజు 4, రెండో రోజు 1, చివరి రోజైన సోమవారం 12.. మొత్తం 17 నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయి. ఇందులో జనసేన 6, వైసీపీ 3, టీడీపీ 1, కాంగ్రెస్‌ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్‌లు 4 నామినేషన్లు సమర్పించారు.

  • కార్పొరేటర్‌ స్థానాలకు తొలిరోజు 6, రెండోరోజు 84, మూడో రోజు 376.. మొత్తం 466 నామినేషన్లు స్వీకరించారు. ఇందులో టీడీపీ తరపున 177, వైసీపీ నుంచి 149, జనసేన 53, బీజేపీ నుంచి 24, కాంగ్రెస్‌ 6, సీపీఎం 3, ఇతర పార్టీల తరపున 1, స్వతంత్ర అభ్యర్థులుగా 53 నామినేషన్లు అందాయి. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

  • ఆమదాలవలసలో...

  • ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి చివరిరోజు నామినేషన్లకు అభ్యర్థులు పోటెత్తారు. చైర్‌పర్సన్‌, వార్డుస్థానాలకు సంబంధించి తొలిరోజు శనివారం రెండు నామినేషన్లు పడగ్గా.. ఆదివారం 38 నమోదయ్యాయి. సోమవారం 114 నామినేషన్లు దాఖలైనట్టు కమిషనర్‌ టి.రవి తెలిపారు. ఇందులో చైర్‌పర్సన్‌ స్థానానికి నాలుగు, కౌనిల్సర్లు అభ్యర్థులుగా 110 మంది నామినేషన్లు వేసినట్టు వెల్లడించారు. మొత్తం మూడు రోజుల్లో 154 నామినేషన్లు నమోదయ్యాయని తెలిపారు. చైర్‌పర్సన్‌ స్థానం నుంచి ఆరుగురు, 28 వార్డుల్లో కౌన్సిలర్‌ స్థానాలకు 148 మంది నామినేషన్‌ వేశారని పేర్కొన్నారు.

  • సోమవారం టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల నామినేషన్‌ వేశారు. అలాగే వైసీపీ తరపున మాజీ కౌన్సిలర్‌ బొడ్డేపల్లి అజంతాకుమారి నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి సన్నిహితురాలు.. లఖినేని కళ్యాణి నామినేషన్‌ వేశారు. మొత్తంగా టీడీపీ నుంచి ముగ్గురు, వైసీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు నామినేషన్‌ వేశారు. కౌన్సిలర్‌ స్థానాలకు సంబంధించి టీడీపీ తరపున 62 మంది, వైసీపీ నుంచి 60 మంది, జనసేన తరపున 13 మంది, బీజేపీ నుంచి ఐదుగురు, స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది మంది నామినేషన్‌ వేసినట్టు కమిషనర్‌ రవి తెలిపారు.

  • నేటి నుంచి నామినేషన్ల పరిశీలన

  • శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో దాఖలైన నామినే షన్‌ పత్రాలను మంగళవారం నుంచి పరిశీలించనున్నట్టు కమిషనర్‌ జి.శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. ‘60 డివిజన్లకు సం బంధించిన నామినేషన్ల పరిశీలన కోసం 15 మంది రిటర్నింగ్‌ అధికారులను నియ మించాం. బొందిలీపురంలోని వంశధార పాతక్వార్టర్స్‌ ప్రాంగణంలో మంగళ, బుధ వారాల్లో ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు నామినేషన్లు పరి శీలిస్తాం. అభ్యర్థి, అభ్యర్థి తరపున ఎన్ని కల ఏజెంట్‌ హాజరుకావచ్చు’ అని కమి షనర్‌ తెలిపారు.

  • అంతటా ప్రశాంతం: ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ.. పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌, వంశధార కార్యాలయం, ఆమదాలవలసలో మున్సిపల్‌ కార్యాలయంలోని నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్ఠంగా పోలీసు ఆంక్షలు అమలు చేశామన్నారు. డ్రోన్‌ కెమేరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేశామన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:22 AM