Share News

శ్రీముఖలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఆదాయం 7.31 లక్షలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:43 PM

: శ్రీముఖలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని రు.7,31,098లుఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. దేవదాయశాఖ ఏసీ ప్రసాద్‌ పట్నాయక్‌ ఆదేశాలు మేరకు మందస గ్రూపు దేవాలయాలు కార్యనిర్వహణాధికారి ఎస్‌.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం హుండీని తెరచిలెక్కించారు

   శ్రీముఖలింగేశ్వరస్వామి  మహాశివరాత్రి ఆదాయం 7.31 లక్షలు
హుండీ లెక్కిస్తున్న అర్చకులు, సత్యసాయిసేవా సమితి సభ్యులు :

జలుమూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని రు.7,31,098లుఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. దేవదాయశాఖ ఏసీ ప్రసాద్‌ పట్నాయక్‌ ఆదేశాలు మేరకు మందస గ్రూపు దేవాలయాలు కార్యనిర్వహణాధికారి ఎస్‌.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం హుండీని తెరచిలెక్కించారు.ఈ సం దర్భంగా హుండీ ద్వారా రు.4,14,818లు, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రు.2,40,520లు, కేశఖండన ద్వారా రు.2160లు, వివిదరకాలుగా రు.73,600లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్‌ శివప్రసాద్‌ పాడి, పాలకమండలి సభ్యులు, కొమనాపల్లి సత్యసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:43 PM