3 నుంచి శ్రీకూర్మనాఽథుని డోలోత్సవాలు
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:12 AM
ప్రసిద్ధ శ్రీకూర్మ క్షేత్రంలో మార్చి 3వ తేదీ నుంచి మూ డు రోజల పాటు జరగనును న్న డోలోత్సవాల పోస్టర్ ను కేంద్ర మంత్రి కింజ రాపు రామ్మో హన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ గురు వారం శ్రీకాకుళంలో ఆవిష్కరిం చారు.
గార, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ శ్రీకూర్మ క్షేత్రంలో మార్చి 3వ తేదీ నుంచి మూ డు రోజల పాటు జరగనును న్న డోలోత్సవాల పోస్టర్ ను కేంద్ర మంత్రి కింజ రాపు రామ్మో హన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ గురు వారం శ్రీకాకుళంలో ఆవిష్కరిం చారు. ఈ మేరకు కేంద్రమంత్రిని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈవో టి.వాసుదేవరావు వారిని కలిసి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వా నించారు. కార్యక్ర మంలో ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
స్వామివారి తిరువీధి
శ్రీకూర్మనాథుని డోలోత్సవాల్లో భాగంగా ముందస్తుగా ప్రతి ఏటా జరిగే విధంగా గురు వారం సాయంత్రం స్వామివారి త్రివిధ ఉత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద రెండు పల్లకిల్లో శ్రీదేవి, భూదేవి సమేత గోవింద రాజస్వామి వారితో పాటు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను వేంచేపు చేసి వేదమంత్రాలు, మేళతాళాల మధ్య తిరువీధి నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో టి.వాసుదేవరావు ప్రధాన అర్చకుడు సీహెచ్ సీతారామనరసింహా చార్యులు, ఇతర అర్చకులు పాల్గొన్నారు.