Share News

విద్యార్థుల్లో క్రీడాశక్తిని పెంపొందించాలి

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:38 PM

విద్యార్థుల్లో క్రీడాశక్తిని పెంపొందించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం పాతపట్నంలో 20 జిల్లాల బాలబాలికలకు నిర్వహించిన ఏపీ సబ్‌ జూనియర్స్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌ టెన్నీస్‌ చాంపియన్‌షిప్‌, రాష్ట్రస్థాయి టీం ఎంపిక-2026 పోటీలు ముగిశాయి.

 విద్యార్థుల్లో క్రీడాశక్తిని పెంపొందించాలి
బాలుర జట్టుకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో క్రీడాశక్తిని పెంపొందించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం పాతపట్నంలో 20 జిల్లాల బాలబాలికలకు నిర్వహించిన ఏపీ సబ్‌ జూనియర్స్‌ అంతర్‌ జిల్లా సాఫ్ట్‌ టెన్నీస్‌ చాంపియన్‌షిప్‌, రాష్ట్రస్థాయి టీం ఎంపిక-2026 పోటీలు ముగిశాయి. ఈ మేరకు ప్రఽథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాలు వరుసగా బాలుర టీం విభాగంలో గుం టూరు, ఎన్‌టీఆర్‌, కృష్ణా, కాకినాడ జిల్లాలు సాధించగా బాలికల విభాగంలో గుంటూ రు, ఎన్‌టీఆర్‌, కాకినాడ, కడప జిల్లాలు సాధించాయి. సింగిల్స్‌లో బాలుర విభాగంలో ఎస్‌కే టాంజిల్‌(కృష్ణ), ఎస్‌కే గౌస్‌(కృష్ణ), ఎ.రవీంద్ర(శ్రీకాకుళం), జి. మహేశ్వర్‌ (గుంటూరు) బాలికల విభాగంలో ఎస్‌. ఈశ్వరి(ఎన్‌టీఆర్‌), ఎ.హాసిని (ఎన్‌టీఆర్‌), జి. కనుష్క సాయి(గుంటూరు), వై.కావ్య(అనంతపురం) జిల్లాల క్రీడాకారులు గెలుపొం దినట్లు రాష్ట్ర బాధ్యులు యెన్ని శేఖర్‌బాబు తెలిపారు. విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్ఞాపికలు, బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాఫ్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్‌ రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు కె. రాజారావు, లక్ష్మీనారాయణ దొర పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:38 PM