Share News

క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయి: కలిశెట్టి

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:27 PM

క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని, మానసికోల్లాసానికి దోహ దం చేస్తాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయి: కలిశెట్టి
వెటరన్‌ క్రీడాకారులను సత్కరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని, మానసికోల్లాసానికి దోహ దం చేస్తాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సంక్రాంతి పండగను పురస్క రించుకొని మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో 30 సంవ త్సరాల కిందటి స్నేహితులతో కలిసి మంగళవారం క్రికెట్‌ ఆడా రు. అంబేద్కర్‌ యూనివర్సిటీ పీడీ మన్నేల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెటరన్‌ క్రీడాకారుల క్రికెట్‌ పోటీ మంగళవారం జరిగింది. తొలుత టాస్‌ గెలిచిన ఎంపీ కలిశెట్టి అప్పల నాయు డు టీమ్‌ బ్యాంటింగ్‌ ఎంచుకుంది. 12 ఓవర్లలో 63 పరుగుల సాధించింది. ఎంపీ కలిశెట్టి 38 పరుగులు చేసి, రెండు వికెట్లు తీసి ఆల్‌రౌడర్‌ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడి యట్‌ చదువుకున్న రోజుల్లో క్రికెట్‌ ఆడిన స్నేహితులతో మరలా ఈ రోజు ఆడడం ఆనందంగా ఉంద న్నారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. విశ్రాంత ఉపాధ్యా యుడు చందు, పీడీ శ్రీనివాస రావు, విశ్రాంత ఎస్‌ఐ చంద్రరావు, ఇడదాసుల సత్య నారా యణకు సత్కరించారు. కార్యక్రమంలో వెట రన్‌ క్రీడాకారులు దూసి వెంకటేష్‌, గేదెల చిన్నం నాయుడు, పిన్నింటి సత్యం నాయుడు, ఇడదాసుల తిరు పతిరాజు, డి.రమణమూర్తి, బలి వాడ ఉమామహేశ్వరావు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:27 PM