విద్యతో పాటు క్రీడలు అవసరం
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:42 PM
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చనలు తెలిపారు.
నరసన్నపేట, జూలై 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చనలు తెలిపారు. సోమవారం నరసన్నపేటలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాల ఆవరణలో అమరావతి చాంపియన్‌షిప్ క్రీడాపోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, పొందర కురాకుల రాష్ట్ర చైర్మన్ దామోదర నర్సింహులు, టీడీపీ మండలాధ్యక్షుడు అడపా చంద్రశేఖర్, వంశధార డీసీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, గొద్దు చిట్టిబాబు, కళింగ కోమటి డైరెక్టర్ జామి వెంకట్రావు, భారతి, పాగోటి అప్పలనాయుడు, కింజరాపు రామారావు, బోయన సతీష్, సాసుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
పలాసలో క్రీడాకారుల ఎంపిక
పలాస, జూలై 20(ఆంధ్రజ్యోతి): పలాస ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో అమరావతి చాంపియన్‌షిప్‌కు సంబంధించి నియోజకవర్గస్థాయి వాలీబాల్, కబడ్డీ, హాకీ, అథ్లెటిక్స్, ఖోఖో, యోగా, బాస్కెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, చదరంగం, బ్యాడ్మిం టన్ పోటీలు నిర్వహించి క్రీడాకారులను సోమవారం ఎంపికచేశారు. ఈ కార్య క్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, కొరికాన శంకర్, తారక్ పాల్గొన్నారు.
నియోజవకర్గ స్థాయి జట్ల ..
టెక్కలి, జూలై 20(ఆంధ్రజ్యోతి): టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర క్రీడా ప్రాఽధికారిత సంస్థ ఆధ్వర్యంలో అమరావతి కప్ నియోజకవర్గ స్థాయి క్రీడాపోటీలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, చెస్ తదితర క్రీడలు నిర్వహించి నియోజవకర్గ స్థాయి జట్లను ఎంపికచేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ గోవిందమ్మ, పినకాన జోగారావు, ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, కోళ్ల లవ కుమార్, మామిడి రాము, నాగల్ల రమేష్, గజరాజు శ్రీనివాస్, ఎస్.లక్ష్మణరావు, సీహెచ్ వాసుదేవరావు, ఎన్.నాగరాజు, బి.నారాయణరావు, కె.ప్రకాష్, ఎన్.జనార్దన రావు పాల్గొన్నారు.