Share News

క్రీడలతో మానసికోల్లాసం: ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:34 PM

క్రీడలు మానసికోల్లాసానికి, శరీరదారుఢ్యానికి దోహదపడ తాయని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం: ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌
విజేత ఎచ్చెర్ల జట్టుకు ట్రోఫీని అందజేస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసికోల్లాసానికి, శరీరదారుఢ్యానికి దోహదపడ తాయని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. యువనేత నడుకుదిటి తేజాబాబు ఆధ్వ ర్యంలో గత పది రోజులుగా ఎన్‌ఈఆర్‌ ప్రీమి యర్‌ లీగ్‌ ఏ మోడీ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వ హించారు. నాలుగు మండలాల నుంచి సుమారు 80 జట్లు పాల్గొన్నాయి. మంగళవారం లావేరు- ఎచ్చెర్ల జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగ్గా ఎచ్చెర్ల టీమ్‌ విజయం సాధించింది. ముగింపు కార్యక్ర మంలో ఎమ్మెల్యే విజేత జట్టుకు ట్రోఫీ అందించి అభినందించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. టోర్నమెంట్‌ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ మైదా నంలో ఉండి పోటీలను పర్యవేక్షించి క్రీడాకారు లను, నాయకులను ఉత్సాహపరిచారు.)

Updated Date - Jun 02 , 2026 | 11:34 PM