Share News

కూటమి ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం

ABN , Publish Date - May 06 , 2026 | 11:49 PM

రాష్ట్రంలో వైసీపీహయాంలో క్రీడలను నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

కూటమి ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

వైసీపీ హయాంలో నిర్వీర్యం

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

సీఎంసీసీ ఎమ్మెల్యే కప్‌ పోటీలు ప్రారంభం

ఆమదాలవలస, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీహయాంలో క్రీడలను నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సీఎం సీసీ జిల్లాస్థాయి ఎమ్మెల్యే కప్‌ క్రికెట్‌ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పట్టణంలో గత టీడీపీ పాలనలో స్టేడియం నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రభుత్వరంగ సంస్థ నుంచి ఆంధ్రా క్రికెట్‌ సంఘానికి మంజూరుచేసిన రూ.37 లక్షలను వైసీపీ పాలనలో బోగస్‌ జిల్లా క్రికెట్‌ సంఘం ఏర్పాటు చేసి నిధులను బదలాయించి దుర్విని యోగం చేశారని విమర్శించారు. ప్రస్తుతం క్రికెట్‌ స్టేడి యంను ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి పాదనలు చేశామన్నారు. దాని పక్కన ఇండోర్‌ స్టేడి యం నిర్మించేందుకు రూ.కోటి నిధులు మంజూరు చేసి నట్లు తెలిపారు. క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. క్రీడల్లో మాల్‌ ప్రాక్టీస్‌కు ఎంతటి వారు సిఫారసు చేసిన సహించేది లేదని ఆయన హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌ ఆధ్వ ర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తు న్నారు. కార్య క్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదల వలస రమేష్‌, ముని సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా విద్యాసాగర్‌, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ టి. చంద్రశేఖర్‌, టీడీపీ నాయకులు ఎస్‌.మురళీధర్‌, నాగళ్ల మురళీధర్‌ యాదవ్‌, బి.అప్పారావు, బి.శంకర్‌ భాస్కర్‌, ఎ.రాము, జిల్లా క్రికెట్‌ సంఘ ప్రతినిధులు పీపీ నాయుడు, ఎన్‌.ఈశ్వరరావు, చిక్కోలు చేయూత ప్రతినిధులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 11:49 PM