ఆధ్యాత్మికత శాంతికి మార్గం
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:39 PM
ఆధ్యాత్మికభావాలే సామాజికశాంతికి మార్గ మని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, ఫిబ్రవరి20(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మికభావాలే సామాజికశాంతికి మార్గ మని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. శుక్రవారం పాతపట్నంలోని ఆలాంధ్రరోడ్‌లో ఆంజనేయ విగ్రహ పతిష్ఠా ముగింపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు రెండు లక్షలు అందజేశా రు. ఎమ్మెల్యే వెంట కూటమి నేతలు ఉన్నారు.కాగా వేదపండితుల ఆధ్వర్యంలో భక్తులు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నదానకార్యక్రమంలో పాతప ట్నంతోపాటు పరిసరగ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.