ఆధ్యాత్మికతే భారతీయ సంస్కృతికి మూలాధారం
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:10 AM
భారతీయ సంస్కృతికి ఆధ్యా త్మికతే మూలాధారమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): భారతీయ సంస్కృతికి ఆధ్యా త్మికతే మూలాధారమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం తోటపాలెం కూడలి వద్ద ఉన్న విశ్వహిందూపరిషత్ కార్యాలయ ప్రాంగ ణంలో ఆది శంకరాచార్యుల జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిశంకరులు బోధించిన అద్వైత సిద్ధాంతం, మనిషిలో ఏకత్వ భావనను పెంపొందిస్తుందన్నారు. సమా జంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో ఆయన ఆలోచనలు ఎంతో కీలకమన్నారు. యువత ఆయన బోధనలను తెలుసుకుని, ఆచరించి, చక్కని జీవనాన్ని సాగించాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ సంస్కృ త విశ్వవిద్యాలయం, తిరుపతికి చెందిన ప్రొఫెసర్ కుప్పా విశ్వనాథ శర్మ శంకర గ్రంథ రత్నావళిపై ప్రసంగించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పెంట చంద్రశేఖర శర్మ, కార్తికేయశర్మ, డా.కె.అమ్మన్నాయుడు తదిత రులు పాల్గొన్నారు.